ముంబై: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం33వ పడిలోకి అడుగుపెట్టాడు. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన రోహిత్ సాదాసీదాగా బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. భార్య రితిక, కూతురు సమైరాతో ఆనందంగా గడిపాడు. ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడడంతో ఈసారి ముంబై ఇండియన్స్ సహచరుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయాడు. రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్ ప్రపంచం ఘనంగా శుభాకాంక్షలు తెలిపింది. ‘హిట్ మ్యాన్’ కు స్పెషల్ డే అంటూ ట్వీట్ చేసింది. రితిక.. భావోద్వేగంతో రోహిత్ కు చెప్పిన విషెస్ అదిరిపోయాయి. ‘నా ఊపిరి ఉన్నంత వరకు, నన్ను నవ్వించే వారికి, నాకు ఇష్టమైన ప్రయాణ సహచరుడికి, నా బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ నాన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కూడా.. రోహిత్ స్పెషల్ విషెస్ తెలిపాడు. ‘హ్యాపీ బర్త్ డే రోహిత్. ఫ్యూచర్ లో నీవు మరెన్నో సొగసైన ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షిస్తున్నా’ అని విరాట్ ట్వీట్ చేశాడు. ‘నా ఓపెనింగ్ పార్ట్ నర్ రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు.. మీరు షూటింగ్ స్టార్ గా బంతిని క్లీన్ గా స్టేడియం బయటకు బాదుతూనే ఉండాలని కోరుకుంటున్నా’ అని ధవన్ విషెస్ తెలిపాడు.
- April 30, 2020
- Top News
- క్రీడలు
- BIRTHDAY
- ROHITSHARMA
- ఇండియన్ క్రికెటర్
- ముంబై ఇండియన్స్
- Comments Off on రోహిత్.. హ్యాపీ బర్త్ డే