సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రైల్వేలైన్ ఏర్పాటుకు భూసేకరణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన అప్పగించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ సూచించారు. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ ట్రాక్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 గ్రామాల మీదుగా వెళ్తుందని తెలిపారు. ఈ గ్రామాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై ఆరాతీశారు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణం మీదుగా ఈ ట్రాక్ వస్తుందని తెలిపారు. ఇది భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వివరించారు. ఈ గ్రామాల్లో 946.17 ఎకరాల సరిహద్దు ఉంటుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులతో సమీక్షించి భూముల అప్పగింతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ న్యాయవాది రాజశ్రీపతిరావు, భూసేకరణ ఓఎస్డీ మనోహర్, సహాయక కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎంఎంఈఎస్ఈ శ్రీకాంత్, ఈఈ రామకృష్ణ, సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావు, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
- January 6, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DAKSHINAKASHI
- KOTHAPALLY
- MANOHARABAD
- RAILWAYLINE
- RAJANNA SIRICILLA
- VEMULAWADA
- కొత్తపల్లి– మనోహరాబాద్
- దక్షిణకాశీ
- రాజన్న సిరిసిల్ల
- వేములవాడ
- Comments Off on రైల్వేలైన్ భూసేకరణ వేగవంతం చేయండి