వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి
సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, అప్పాజీపల్లి, చిన్న ఘనపూర్, మెదక్ మండలం మంబోజి పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ లో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలిగించవద్దు అని పీఏసీఎస్ అధికారులకు, చైర్మన్లకు సూచించారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి లో రైతులపై కేసు నమోదు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏఈవోను కొట్టిన పోలీస్ వ్యవహారం దురదృష్టకరమన్నారు. ఈ సంఘటనలపై విచారణ వ్యక్తం చేస్తున్నానని, ఈ విషయమై డీజీపీతో మాట్లాడినట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు. మంత్రి వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఏవో పరుశరాం, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య తదితరులు ఉన్నారు.