Breaking News

రైతులు ఏకం కావాలి

రైతులు ఏకం కావాలి

సారథి న్యూస్​, మానవపాడు: జనాభాలో 60 శాతం ఉన్న రైతులు, రైతు అనుబంధ రంగాలను ఒక్క తాటిపైకి తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి ఎస్​.నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని చెప్పారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే వ్యవసాయ ఆధారిత దేశాలని.. అందులో మనదేశం ఒకటని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​ కె.సరిత, ఎమ్మెల్యే అబ్రహం, వినియోగదారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు తిమ్మప్ప, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రమాదేవి, మార్కెట్​ యార్డు చైర్మన్ రాందేవరరెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ, ఎంపీడీవో రమణ, జెడ్పీటీసీలు కాశపోగు రాజు, రాములమ్మ, సర్పంచ్ మార్థమ్మ, టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.