Breaking News

రైతులు ఇబ్బందులు పడొద్దు

రైతులు ఇబ్బందులు పడొద్దు

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, కూలీలు సామాజిక దూరం పాటించాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు.

బుధవారం బిజినేపల్లి మండలంలోని లింగసానిపల్లి, కారుకొండ గ్రామాల్లో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. లింగసానిపల్లిలో 6,440 బస్తాలు, కారుకొండలో 1,807 బస్తాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారని చెప్పారు.

జిల్లావ్యాప్తంగా 211 కొనుగోలు కేంద్రాల్లో 43,264 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 8,357 మంది రైతుల నుంచి కొన్నట్లు చెప్పారు. ఆయన వెంట ఏడీఏ రమేష్ వ్యవసాయ అధికారులు ఉన్నారు.