మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సారథి న్యూస్, జనగామ: నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు సూచించారు. ఆదివారం జనగామలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులను రాజులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి ఇచ్చి సాగును ప్రోత్సహిస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ సభ్యులు, కలెక్టర్ పాల్గొన్నారు.