సారథి న్యూస్, వైరా: ఖమ్మం జిల్లా వైరా విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సుమారు 270 మంది రైతులకు రూ.90లక్షల విలువైన పంట రుణాల చెక్కులను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ శనివారం క్యాంపు ఆఫీసులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. రైతులు స్వల్పకాలిక రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని కోరారు. గొల్లపూడి, పాలడుగు గ్రామాల్లో సొసైటీ గోదాములు నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బొంతు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ పాల్గొన్నారు.
- August 29, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- KHAMMAM
- MLA RAMULU NAIK
- VISHALA SAHAKARA SANGHAM
- VYRA
- ఎమ్మెల్యే రాములు నాయక్
- ఖమ్మం
- విశాల సహకార సంఘం
- వైరా
- Comments Off on రైతులకు పంటరుణాల చెక్కులు