సారథి న్యూస్, వైరా: ప్రభుత్వ అధికారుల్లో కొందరు చేస్తున్న నీచమైన పనుల వల్ల మొత్తం వ్యవస్థకే మచ్చ ఏర్పడుతుంది. రేషన్ కార్డు మంజూరు చేసేందుకు లంచం తీసుకుని తాజాగా ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపడికి చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కార్డు మంజూరు చేయాలంటే రూ.1500 లంచం ఇవ్వాలంటూ వీఆర్వో కశ్యప్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు వీఆర్వో కశ్యప్.. కంప్యూటర్ ఆపరేటర్ సతీశ్ సాయంతో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
- July 30, 2020
- Archive
- క్రైమ్
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- EMPLOYEE
- KAMMAM
- RATIONCARD
- VIRA
- లంచం
- వైరా
- Comments Off on రేషన్ కార్డుకూ లంచం