సారథిన్యూస్, ఖమ్మం: రెవెన్యూశాఖ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని గోండ్వానా సంక్షేమపరిషత్ నాయకుడు విద్యాసాగర్ ఆరోపించారు. గురువారం ఆయన ఖమ్మం జిల్లా కోయవీరాపురంలో పర్యటించి ప్రజల భూసంబంధిత సమస్యలు తెలుసుకున్నారు. ఆదివాసి గ్రామమైన కోయవీరాపురం రెవెన్యూ అధికారుల అక్రమాలతో కొట్టుమిట్టాడుతున్నదని చెప్పారు. ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులు చట్టాన్ని అమలుచేయడం లేదన్నారు. ఆయనవెంటన గిరిజనసంఘం నాయకులు చాప శాంతమ్మ, సోడి రాంబాయి, పీర్ల చెన్నమ్మ తదితరులు ఉన్నారు.
- June 25, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- KAMMAM
- REVENUE
- THURSDAY
- అక్రమాలు
- రెవెన్యూశాఖ
- Comments Off on రెవెన్యూశాఖలో భారీగా అక్రమాలు