సారథి న్యూస్, శ్రీకాకుళం: రెడ్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని స్పష్టం చేశారు. సాయంత్రం జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటైన్ మెంట్ జోన్లలో డోర్ డెలివరీ సౌకర్యం పెంచాలని సూచించారు. కరోనా నియంత్రణలోజిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు చాలా శ్రమిస్తున్నారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో ప్రసూతి, గుండె జబ్బులు తదితర కేటగిరీల వారీగా ఆస్పత్రులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి సీఎం సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.
- April 23, 2020
- ఆంధ్రప్రదేశ్
- DOOR DELIVERY
- REDZONE
- ఏపీ
- కరోనా
- డోర్ డెలివరీ
- రెడ్ జోన్
- Comments Off on రెడ్జోన్లలో కార్యకలాపాలు వద్దు