- బీజేపీ నాయకుల డిమాండ్
సారథి న్యూస్, హుస్నాబాద్: రైతుబంధు నిబంధనలు తొలగించి రూ.లక్ష పంట రుణమాఫీ చేయాలని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన పంటలను మాత్రమే పండించాలని, లేనిపక్షంలో రైతుబంధు ఇవ్వబోమనడం సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. అనంతరం తహసీల్దార్ వేణుగోపాల్ రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నునావత్ మోహన్, రాజ్ కుమార్, కృష్ణ, సంపత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.