Breaking News

రీమేక్ ల డైరెక్టర్​తో రామ్​చరణ్​

రీమేక్ ల డైరెక్టర్తో రామ్​చరణ్​

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న రామ్‌ చరణ్.. మరోవైపు ‘ఆచార్య’ సినిమాలోనూ కీలకపాత్ర పోషించనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్‌ నటించబోయే సినిమా ఏమిటి? డైరెక్టర్ ఎవరు లాంటి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది టాలెంటెడ్ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్‌ కాలేదు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు, ఎడిటర్ మోహన్ కొడుకు మోహన్ రాజా పేరు తెరపైకి వచ్చింది. మోహన్ రాజా ‘హనుమాన్‌ జంక్షన్‌’ సినిమాతో తెలుగులోనే కెరీర్‌ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత తన తమ్ముడు జయం రవితో వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్‌లో బిజీ అయ్యాడు.

అయితే చరణ్ నటించిన ‘ధృవ’మూవీకి ఒరిజినల్‌ వెర్షన్‌ అయిన ‘తనీ ఒరువన్‌’ తీసింది కూడా మోహనే. ఆ సినిమాకే వీరిద్దరు కలిసి వర్క్ చేయాల్సి ఉన్నా కుదరలేదట. అయితే ఇప్పుడో ప్యాన్‌ ఇండియా సబ్జెక్ట్ తో చరణ్ ని ఒప్పించాడని.. ఈ ప్రాజెక్ట్ కోసం ‘అంధాదూన్‌’ తమిళ రీమేక్‌ నుంచి కూడా మోహన్ రాజా తప్పుకున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. ఆ సినిమా నుంచి తప్పుకుని చరణ్‌ ప్రాజెక్టుపై దృష్టి పెడుతున్నాడట. మరోవైపు ‘తనీ ఒరువన్‌ 2’ కూడా చేయబోతున్నాడు. అయితే ఇది కూడా ‘ధృవ’ రీమేక్ లానే ఈ సీక్వెల్‌ స్టోరీ కూడా చరణ్‌ తో తెలుగుతో తీస్తాడా? రీమేక్ చేయనున్నాడా..? లేక కొత్త కథ ఏమైనా అన్నది తెలియాల్సి ఉంది.