Breaking News

‘రిమ్స్’లో కార్మికుల నిరసన

సారథి న్యూస్, ఆదిలాబాద్ : సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం రిమ్స్ ఆవరణలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పు, 12 గంటల పని దినాన్ని పెంచుతుందన్నారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

కార్మికులందరికీ బోనస్ రూపంలో రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అక్రమ్ ఖాన్, ఆర్.సురేందర్, దేవిదాస్, నవీన, సుమన్, తాయి పాల్గొన్నారు.