Breaking News

రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తరా?

రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తరా?
  • కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ
  • కేంద్రం వైఖరి నియంతృత్వంగా ఉంది
  • ప్యాకేజీ వట్టి పచ్చి దగా, మోసం: సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్‌: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వట్టి పచ్చి దగా, మోసం అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ పై ఆయన స్పందించారు. కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయని అన్నారు. ‘రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి నియంతృత్వంగా ఉంది. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తారా? ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ ఆంక్షలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల దారుణంగా వ్యహరిస్తోంది. కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే రుణం ఇస్తామనడం ప్యాకేజీ అవుతుందా?’ అని ప్రశ్నించారు. మెడపై కత్తిపెట్టి ట్యాక్సీలు వసూలు చేయమంటరా? అని నిలదీశారు.