Breaking News

రామరాజు ఫర్ భీమ్

రామరాజు ఫర్ భీమ్

అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియో ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో వస్తున్న టీజర్ ను అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’ సెన్సేషన్ క్రియేట్ చేయగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ ‘రామరాజు ఫర్ భీమ్’ ఎంతటి సంచలనం సృష్టించనుందో. జక్కన్న తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. ప్యాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ గేవగణ్, శ్రియాశరణ్, సముద్రఖని, అలియా భట్, ఒలీవియా, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడున్నర నెలలుగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ రీసెంట్ గా మొదలైంది.