ఎమ్మెల్యే కోరుకంటి చందర్
సారథి న్యూస్, గోదావరిఖని: రాష్ట్రంలోనే రామగుండం కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే, సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో డీఎంఎఫ్ టీ నిధులు రూ.1.25 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై వారు చర్చించారు.
కార్పొరేషన్ అభివృద్ధికి కార్పొరేటర్లు, కమిటీ సభ్యులు, అధికారులు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్ కుమార్, రామగుండం తహసిల్దార్ రవీందర్, మున్సిపల్ అధికారులు మహేందర్, సుచరణ్, మాధవి, అభినయ్, ప్రవీణ్, రాములు, కిషోర్ కుమార్ పాల్గొన్నారు.