సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రధాని మోదీ పాలన జనరంజకంగా సాగుతున్నదని
కరీంనగర్ జిల్లా బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం రామవరం, గండిపల్లి గ్రామాల్లో బీజేపీ ఏడాది పాలనపై నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో మాట్లాడారు. దేశంలోని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చేతివృత్తులపై ఆధారపడిన ప్రతి కుటుంబానికి చేయూతనిస్తున్న ప్రజా నాయకుడు మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాగర్, మనోహర్, అజయ్, కృష్ణ, మహేష్, నాగేష్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
- June 17, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- మోదీ
- Comments Off on మోదీపాలన జనరంజకం