Breaking News

మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, హుస్నాబాద్: మృతుడి కుటుంబానికి వాట్సాప్ గ్రూపు సభ్యులు మేమున్నామని చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ దామెర మల్లేశం మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొందుగుల వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. సోషల్ మీడియాలో ఒక్కటైన గ్రూప్ సభ్యులు తలకొంత డబ్బులు వేసుకుని 50కిలోల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మల్లేశం, గ్రూప్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.