Breaking News

మెగాస్టార్​ సినిమాలో సుహాసిని


గతేడాది మోహన్​లాల్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్​ బస్టర్ మలయాళం మూవీ ‘లూసిఫర్’. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ కానుంది. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కు తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో కీలకమైన మార్పులు చేస్తున్నారట. అయితే ఈ సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. లూసిఫర్ తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. మలయాళంలో ఇండస్ట్రీ హిట్​గా నిలిచింది ‘లూసిఫర్’. మోహన్ లాల్ పోషించిన పాత్ర చిరంజీవికి తెగ నచ్చేసి ఆ పాత్రను పోషించాలని ఆయన తహతహ లాడుతున్నారట. అయితే ఒరిజినల్ లూసిఫర్ లో నటి మంజు వారియర్ పాత్ర కూడా కీలకమైందే. అయితే తెలుగు వర్షన్ కోసం ఆ పాత్రలో సుహాసిని మణిరత్నం నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.