Breaking News

మూడేళ్లలో భావనపాడు పోర్టు పూర్తి

  • సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టును మూడేళ్లలో పూర్తిచేస్తామని సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రామయ్యపట్నం, మచిలీపట్నం పోర్టులను పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు కూడా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ‘మన పాలన.. మీ సూచన’ మేధోమదన సదస్సులో భాగంగా గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో సానుకూల ప్రభుత్వం ఉందని, పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా చూస్తామని, ఎవరూ డబ్బులు, లంచాలు అడగరని స్పష్టంచేశారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా జ్యూడిషియల్ ప్రివ్యూ కమిటీని నియమిస్తామని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. విశాఖలో నైపుణ్య అభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో స్పీకర్​ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, డాక్టర్​ సీదరి అప్పలరాజు, కలెక్టర్ జె.నివాస్, ముఖ్యప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ, గ్రామీణనీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి.శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్.రామ్మోహన్, గృహ నిర్మాణ సంస్థ పథకం సంచాలకుడు టి.వేణుగోపాల్ పాల్గొన్నారు.