రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
సారథి న్యూస్, గోదావరిఖని: రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో విజయమ్మ ఫౌండేషన్, గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులు, బియ్యం ఇతర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ మంచికట్ల దయాకర్, పాతపెల్లి ఎల్లయ్య, తస్లీమ భాను, జహీద్ పాషా, అక్రం, అబ్దుల్ గఫూర్, సోహైల్, ఉస్మాన్ షరీఫ్ పాల్గొన్నారు.