Breaking News

ముమ్మరంగా హరితహారం

సారథిన్యూస్​, మహబూబాబాద్​: హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నది. ఆరోవిడుత హరితహారంలో భాగంగా మహబూబాబాద్​ జిల్లా పోలీస్​ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి మొక్కలు నాటారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో హరితహారం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, డీఎస్పీ నరేశ్​కుమార్, ఏఆర్ డీఎస్పీ జనార్దన్​రెడ్డి, ఆర్ఐలు నరసయ్య, పూర్ణచందర్, సురేశ్​, లాల్ బాబు, ఐటీ కోర్ ఇన్స్​స్పెక్టర్​ రాజయ్య, సీఐ సాగర్, సీసీఎస్​ సీఐ ఏ వెంకట్రావు, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, హోంగార్డ్స్​ పాల్గొన్నారు.