Breaking News

మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం

మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం

సామాజికసారథి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై బహుజన సమాజ్​పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్ ​కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను కార్మోన్యుకులు చేశారు. పార్టీనేతలు 8 మందికి కీలక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహరచన చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తన టూర్​లో భాగంగా కెనడా పర్యటనను ముగించుకుని వచ్చేనెల 11న తెలంగాణకు తిరిగి రానున్నారు. అప్పటిదాకా ప్రచారం, పార్టీలో చేరికలు, గత ప్రభుత్వాలు ఇక్కడి ప్రజలను మోసం చేసిన తీరు, బీఎస్పీ గెలిస్తే అమలుచేసే కార్యక్రమాలు తదితర అంశాలను ప్రచార పర్యవేక్షణ బాధ్యతలను 8 మందికి చూసుకోనున్నారు. కాగా, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తిరిగి కమలం దళం నుంచి ఆయనే పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, ఇప్పటికే మునుగోడు గడ్డపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ​పార్టీ పోటాపోటీ బహిరంగ సభలతో పొలిటికల్​ హీట్ ​పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్​ చౌటుప్పల్​లో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొంతమంది పార్టీ ముఖ్య నాయకులకు మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం కోసం ఈనెల 23న పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని స్టేట్​ చీఫ్​ కోఆర్డినేటర్ ​మందా ప్రభాకర్ ప్రారంభించారు. తాజాగా మరో ముందడుగు వేస్తూ మునుగోడు ఉపఎన్నిక మానిటరింగ్​ కమిటీని నియమిస్తూ బీఎస్పీ స్టేట్ ​చీఫ్​ డాక్టర్ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ కదనరంగంలోకి దూకేలా గ్రీన్​ సిగ్నల్ ​ఇచ్చేశారు.

బీఎస్పీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న పార్టీ స్టేట్​ చీఫ్​ కోఆర్డినేటర్ ​మందా ప్రభాకర్

సభ్యులు ఎవరంటే..

సభ్యులు బాధ్యతలు
1.మందా ప్రభాకర్​ – శిక్షణ, అభ్యర్థుల స్క్రీనింగ్, పర్యవేక్షణ
2.కందికంటి విజయ్​కుమార్ – కమిటీల మానిటరిగ్, ప్రచారాన్ని ప్లాన్ చేయడం
3.చంద్రశేఖర్​ ముదిరాజ్, డాక్టర్ ​సాంబశివగౌడ్,
దాసరి హనుమయ్య, ఉరుమళ్ల విశ్వం,
కొమ్ము శ్రీనివాస్​ యాదవ్, మల్లేష్​ యాదవ్ – బీసీ విభాగం పర్యవేక్షణ
4.అనితారెడ్డి, నర్రా నిర్మల – మహిళా విభాగం పర్యవేక్షణ
5.మౌలానా షఫీ – మైనార్టీ విభాగం పర్యవేక్షణ బాధ్యతలు
6.డాక్టర్​ వెంకటేశ్ ​చౌహాన్​ – గిరిజనుల విభాగం సంబంధించిన పర్యవేక్షణ
7.బి.ఈశ్వర్, విజయ్​ఆర్యా, మహతి రమేష్, చంద్రశేఖర్​ ముదిరాజ్​ – నిధుల సమీకరణ బాధ్యతలు

8.పల్లవి, సురేష్​ కొణిదేల – డిజిటల్​ మీడియా మానిటరింగ్

One thought on “మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం”

  1. I wish best of luck to bsp party to won the assembly seat of munugoodu, JAI BSP JAI RSP

Comments are closed.