Breaking News

మీ సమస్యలు పరిష్కరిస్తా..

సారథి న్యూస్​, ఎల్బీనగర్(రంగారెడ్డి): నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని ఎంఆర్ఎఫ్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం మార్నింగ్ వాక్​లో భాగంగా మన్సురాబాద్ డివిజన్​లో ఎమ్మెల్యే పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా సరస్వతీనగర్ నుంచి లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ పెద్దచెరువు మీదుగా అమ్మదయ కాలనీ, బాలాజీ నగర్, శుభోదయ నగర్, చిత్రసీమ కాలనీ, జడ్జస్ కాలనీ, జడ్జస్ కాలనీ ఫేస్–1 మీదుగా ఆటోనగర్ డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకున్నారు. అంతకుముందు స్థానిక కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, ఎమ్మెల్యేకు శాలువా కప్పి స్వాగతించారు. ఆయన వెంట సీనియర్ నాయకులు జక్కిడి మల్లారెడ్డి, జగదీష్ యాదవ్, రఘువీర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు.