బుల్లితెర యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి అమ్మాయి. ప్రస్తుతం నిహారిక సినిమాలు చేస్తూనే డిజిటల్ వరల్డ్‌లోనూ రాణిస్తోంది. నాగసౌర్యతో చేసిన ఫస్ట్ సినిమా ‘ఒక మనసు’తో పర్వాలేదు అనిపించుకుంది. ఇక తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన ‘ఒరునల్ల నాల్ పాతు సొల్రేన్’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ డిజిటల్ రంగంలో అడుగుపెట్టి నిహారిక నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొందింది. ఇప్పటి వరకు ఆమె తమిలంలో ఒక సినిమా.. తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. గతేడాది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో నిహారిక గిరిజన యువతి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల నిహారిక పెళ్లి వార్తలు ప్రసార మాధ్యమాల్లో ఊపందుకున్నాయి. ఆ మధ్య ప్రభాస్ ను నిహారిక పెళ్లాడబోతుందనే న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఇవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అయితే ఇటీవల నిహారిక తండ్రి నాగబాబు మెగా డాటర్ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.
‘నిహారికకు ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేస్తామని.. మంచి అబ్బాయి దొరికితే కులం, మతం పట్టింపు అస్సలు లేదని.. నిహారిక పెళ్లి తర్వాతే వరుణ్ తేజ్ పెళ్లి చేస్తానని’ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు తాజాగా నిహారిక ఫేస్ బుక్ లో పోస్ట్ చూస్తే అమ్మడు పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. నిహారిక ప్రముఖ స్టార్ బక్స్ కాఫీ కప్ మీద మిస్ నిహారిక అని రాసి ఉండగా మిస్‌ను కొట్టేసి మిసెస్ అని క్వశ్చన్ మార్క్ పెట్టింది. దీన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన నిహారిక ‘‘ఉహ్.. వాట్ ?’’ అని కామెంట్ పెట్టింది. దీంతో నిహారిక పెళ్లి సెట్ అయిందని హింట్ ఇస్తుందని సోషల్ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
మిమ్మల్ని చేసుకోబోయే లక్కీ పర్సన్ ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. 2020లో అన్ని బ్యాడ్ న్యూస్ వింటున్నాం.. మీరొక్కరే గుడ్ న్యూస్ చెబుతున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐతే అది నిజమో కాదో తెలియదు. ఇంతకు ముందు అల్లు శిరీష్ కూడా ఇలాంటి ట్విస్టే ఇచ్చి తర్వాత అది ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా అని తేల్చేశాడు. మరి నిహారిక పెట్టిన పోస్టుపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.