- రమేష్ వర్మ డైరెక్షన్లో సినిమా
మాస్ మహారాజా రవితేజ మరో చిత్రాన్ని కన్ఫామ్ చేశాడు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా, ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్లో రవితేజ హీరోగా సినిమా
–తెర కెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. స్క్రిప్టు కూడా రెడీ అయిందని, అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా, అన్ని హంగులతో కమర్షియల్ ఎంటర్ టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నారట. లాక్ డౌన్ అనంతరం సాధారణ పరిస్థితులు ఏర్పడగానే సినిమా సెట్ పైకి వెళ్లనుంది. భారీ బడ్జెట్, ఉన్నతస్థాయి సాంకేతిక విలువలతో నిర్మించనున్న ఈ సినిమాకు పేరుపొందిన టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడి చేయనున్నారట.