Breaking News

మాస్కు లేకుంటే.. జరిమానే

మాస్కు లేకుంటే.. జరిమానే

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప తెలిపారు. జిల్లాలో మాస్కు ధరించకుండా, నిబంధనలు ఉల్లంఘించిన 7,086 మందిపై కేసు నమోదు చేసి రూ. 5,77,350 జరిమానా విధించినట్లు ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదివారం తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై జిల్లా పరిధిలో జూన్‌ 24 నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ కేసును నమోదు చేసినట్లు ఆయన వివరించారు. పట్టణ ప్రాంతాల్లో మాస్క్​ లేకుండా వాహనం నడిపితే రూ.100, గ్రామీణ ప్రాంతాలో రూ.50 జరిమానా విధిస్తామన్నారు.