సారథి న్యూస్, రామగుండం: విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్కార్మికులు మానవత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో చనిపోయిన తోటి కార్మికుడి కుటుంబానికి ఆదివారం చేయూత అందించారు. బోజన్నపేట సబ్ స్టేషన్లో పనిచేస్తున్న బండి నర్సింగం ఇటీవల కరోనాతో మృతిచెందాడు. నర్సింగంకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి పెద్దపల్లి డివిజన్లో పనిచేస్తున్న అన్ని సబ్స్టేషన్ల ఆర్టిజన్ కార్మికులు కలసి రూ.43,500 ఆర్థిక సహాయం అందజేశారు. సాయం అందించిన వారిలో ఆర్టిజన్లు కొండి రమేష్, దాసరి కోటి, సంపత్, ప్రవీణ్, రమేష్, శ్రావణ్, రవి పాల్గొన్నారు.
- September 6, 2020
- Archive
- కరీంనగర్
- ARTIZON
- PEDDAPALLY DIVISION
- TRANCO
- ఆర్టిజన్కార్మికులు
- పెద్దపల్లి డివిజన్
- విద్యుత్‌శాఖ
- Comments Off on మానవత్వం చాటిన ఆర్టిజన్ కార్మికులు