సారథి న్యూస్, మహబూబాబాద్: పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. సోమవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34 ,19 వార్డుల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె స్వయంగా పర్యటించి పరిశీలించారు. ప్రతి ఆదివారం ఉదయం 10:10 గంటలకు ప్రతి ఇంట్లో పారిశుద్ధ్య పనులను చేపట్టి.. వృథాగా ఉన్న వస్తువులు తొలగించాలని సూచించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దే కార్యంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆమె వెంట కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్పర్సన్ బిందు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
- June 8, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- MAHABUBABAD
- SATYAVATHIRATHOD
- మంత్రి సత్యవతిరాథోడ్
- మున్సిపాలిటీ
- Comments Off on ‘మహబూబాబాద్’ను తీర్చిదిద్దుదాం