సారథి న్యూస్, దుబ్బాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు పెండింగ్ సమస్యలను తొందరగా పరిష్కరిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ లోని మల్లన్న సాగర్ జలాశయ పనులను పరిశీలించి, పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. డిసెంబర్ మొదటి వారంలోగా పనులు పూర్తవాలని ఆదేశించారు. పనుల్లో క్వాలిటీ ఉండాలని సూచించారు. భూసేకరణ, ఆర్అండ్ ఆర్ కాలనీ అంశంపై అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ తో చర్చించారు. ఆయన వెంట ఆర్డీవో ఆనంతరెడ్డి ,ఈఎన్ సీ మురళీధర్, హరిరాం, సీఈ అజయ్ కుమార్, ఎస్ఈ వేణు, ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.
- April 22, 2020
- తెలంగాణ
- డిసెంబర్
- నీటిపారుదల
- భూసేకరణ
- మల్లన్నసాగర్
- Comments Off on ‘మల్లన్న సాగర్’ కంప్లీట్ కావాలె