భయాందోళనలో రాజేంద్రనగర్ ప్రజలు
సారథి న్యూస్, రాజేంద్రనగర్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లోకి చిరుత ప్రవేశించడంతో స్థానికులు గమనించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కొంతకాలంగా చిరుత పులి రాజేంద్రనగర్ పరిసరాల్లో తిరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు తక్షణమే స్పందించి చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు.