Breaking News

మనోజ్ కుటుంబానికి సాయం

షార్ట్ న్యూస్

సారథి న్యూస్​, నిజామాబాద్​: కరోనా మహమ్మారితో మరణించిన యువ జర్నలిస్టు మనోజ్ కుమార్​ కుటుంబానికి తనవంతు సహాయంగా రూ‌.50వేల ఆర్థిక సాయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు( డీసీసీబీ)అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజలకు వార్తలను అందిస్తూ సమాజానికి మేలు చేస్తున్న యువ రిపోర్టర్ అకాల మరణం కలచివేసిందన్నారు. మనోజ్​ కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.