సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా(కోవిడ్ –19)తో జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతిచెందడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆదివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోజ్ కుమార్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కరోనా బారినపడి ఓ తెలుగు జర్నలిస్ట్ మృత్యువాతపడడం ఎంతో కలచి వేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేనందున జర్నలిస్టులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, మనోజ్ మరణం హెచ్చరిస్తుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. యువ జర్నలిస్టు మనోజ్ మృతి బాధాకరమని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. జర్నలిస్టు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- June 7, 2020
- తెలంగాణ
- ALLAM NARAYANA
- JOURNALIST MANOJ
- కరోనా
- తెలంగాణ
- మీడియా అకాడమీ
- Comments Off on మనోజ్ మరణం కలచివేసింది