భోపాల్: మధ్యప్రదేశ్ మంత్రి తుల్సీ సిలావత్, అతడి భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్‌కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనతో కాంటాక్ట్ అయిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులందరికీ పరీక్షలు చేయగా తుల్సీ సిలావత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం భోపాల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని పలువురు అధికారులు, పోలీస్ సిబ్బందికి కూడా కరోనా సోకినట్టు సమాచారం. కాగా ఇటీవల మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రితో కలిసిన వారందరినీ అధికారులు గుర్తిస్తున్నారు.
- July 29, 2020
- Archive
- జాతీయం
- CARONA
- MADYAPRADESH
- MINISTER
- POSITVE
- మంత్రి
- మధ్యప్రదేశ్
- Comments Off on మధ్యప్రదేశ్ మంత్రికి కరోనా