ఈజిప్ట్ దేశంలోని అలెగ్జాండ్రియా దేశంలోని ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగి ఏడుగురు కరోనా రోగులు మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. పొగతో ఊపిరాడక కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారులు తేల్చారు. ఆసుపత్రిలోని ఎయిర్ కండీషనర్ నుంచి మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈజిప్ట్ సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లనే అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.