చెన్నై: దుర్మార్గుడైన ఓ వృద్ధుడు భార్య గొంతుకోసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో వెలుగుచూసింది. పెరుంగలాథూర్ ప్రాంతంలోని డేవిడ్ నగర్లోని ఓ ఫ్లాటులో జగన్నాథన్ (72), అతడి భార్య సులోచన (62)లు నివాసముండేవారు. అపార్టుమెంట్ పై జగన్నాథన్ మృతదేహాన్ని చూసిన అపార్టుమెంటు వాసులు విషయాన్ని ఆమె భార్యకు చెప్పేందుకు వారి ఫ్లాటుకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో సులోచన కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.