ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్
సారథి న్యూస్, వనపర్తి: భాగ్యరెడ్డి వర్మ.. తెలంగాణ వైతాళికుడని, దళిత చైతన్య ప్రతీక అని, బాల్యవివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించిన మహనీయుడని ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ కొనియాడారు. 132వ జయంతిని శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కళాకారుడు నందిమల్ల డప్పు నాగరాజు నివాసంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారి చూపారని కొనియాడారు. హక్కుల కోసం పోరాటాలు చేశారని గుర్తుచేశారు. అనే స్కూళ్లను ప్రారంభించి విద్యావ్యాప్తికి విశేషంగా కృషిచేశారని అన్నారు. కవిపండితుడు గిరిరాజాచారి, కవి గాయకుడు విభూది ఈశ్వర్, లక్ష్మీ, మాధురి, మాధవి, కార్తిక్ పాల్గొన్నారు.