సారథి న్యూస్, దేవరకద్ర: కొత్తకోట మండలం కనిమెట్ట– జంగమాయపల్లి గ్రామాల బ్రిడ్జిని మంజూరుచేసి వెంటనే పనులు మొదలుపెట్టాలని మంత్రి హరీశ్‌రావును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే దేవరకద్ర మండలం పేరూర్ లిఫ్టును మంజూరుచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరగా.. మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. అనంతరం మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కలిశారు. సరళాసాగర్, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను టూరిజం స్పాట్‌గా చేయాలని కోరారు. స్పీడ్ బోటింగ్ సిస్టం, హరిత రెస్టారెంట్, గెస్ట్ హౌస్ నిర్మించాలని కోరారు.
- September 23, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KANIMETTA
- KOILSAGAR
- MINISTER HARISHRAO
- MLA ALA
- ఎమ్మెల్యే ఆల
- కనిమెట్ట
- కొత్తకోట
- కోయిల్‌సాగర్
- మంత్రి హరీశ్‌రావు
- Comments Off on బ్రిడ్జి కట్టి బాధలు తీర్చండి