కింగ్స్టన్: రన్నింగ్ ట్రాక్‌పై స్వర్ణాల రికార్డులను సృష్టించిన జమైకా మేటి స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్.. నిజజీవితంలో తండ్రిగా ప్రమోషన్ సాధించాడు. అతని భాగస్వామి క్యాసి బెన్నెట్ ఆదివారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. బోల్ట్ దంపతులకు ఇదే తొలి సంతానం. బోల్ట్ తండ్రయిన విషయాన్ని జమైకా ప్రధాని ఆండ్రూ హోల్ నెస్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. ‘మా స్ప్రింట్ లెజెండ్ బోల్ట్, బెన్నెట్‌కు కూతురు పుట్టింది. ఓ అందమైన అమ్మాయిని ఈ భూమి మీదకు తీసుకొచ్చినందుకు మీకు నా అభినందనలు’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ఒలింపిక్ స్ప్రింట్‌లో 8 స్వర్ణాలు సాధించిన బోల్ట్.. 2017లో కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. 100, 200 మీటర్ల పరుగులో బోల్ట్ నెలకొల్పిన ప్రపంచ రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో 100, 200 మీటర్ల రేస్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన ఏకైక అథ్లెట్ బోల్ట్. 2016 ఒలింపిక్స్‌లో జమైకన్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.
- May 20, 2020
- Top News
- క్రీడలు
- BENNET
- BOLT
- KINGSTON
- ఒలింపిక్స్
- జమైకా
- బెన్నెట్
- స్ప్రింటర్
- Comments Off on బోల్ట్ కు పండంటి బిడ్డ