Breaking News

బిజినెస్​మెన్​తో కాజల్​ ఎంగేజ్​మెంట్​?

ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడితో టాలీవుడ్​ చందమామ కాజల్​ అగర్వాల్​ ఎంగేజ్​మెంట్​ జరిగినట్టు సోషల్ ​మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే ఇటీవల కాజల్​ ముంబైలోని ఓ హోటల్​లో బిజినెస్​మెన్​ కుమారుడితో రహస్యంగా ఎంగేజ్​మెంట్​ చేసుకున్నట్టు సమాచారం. తల్లిదండ్రులు సూచించిన వ్యక్తినే కాజల్​ పెళ్లాడబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తుంది. దాంతో పాటు మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో కూడా నటిస్తుంది. ఇవే కాదు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి.