Breaking News

బిగ్​ బ్రేకింగ్.. సెకండ్ ​రౌండ్.. బీజేపీ లీడ్​

  • November 2, 2021
  • Top News
  • Comments Off on బిగ్​ బ్రేకింగ్.. సెకండ్ ​రౌండ్.. బీజేపీ లీడ్​

సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం హుజూరా‘బాద్​షా’ ఎవరో తేలనుంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసారి గతంలో లేనంతగా రికార్డుస్థాయిలో 86.64 శాతం పోలింగ్‌ నమోదైంది. కౌంటింగ్​ ఏర్పాట్లను కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, కమిషనర్ ​సత్యనారాయణ పరిశీలించారు. అయితే సెకండ్ ​రౌండ్​లోనూ కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ​358ఓట్ల లీడ్​లో ఉన్నారు. రెండ రౌండ్లలో కారు గుర్తును పోలిన రోటీమేకర్ కు 158 ఓట్లు పడ్డాయి. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత టీఆర్ఎస్ కు 4,659 (9103), బీజేపీకి 4,851 (9461) కాంగ్రెస్ కు 339 వచ్చాయి. ప్రస్తుతం బీజేపీ 192 (358)ఓట్ల ఆధిక్యంతో ఉంది.