Breaking News

బాల్స్​ను క్రిమిరహితం చేయాలి

మెల్​బోర్న్​: క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఉపయోగించే బంతులనూ క్రిమిరహితం చేయాలని క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు అలెక్స్ కౌంటారిస్ అన్నాడు. తద్వారా క్రికెటర్ల హెల్త్ రిస్క్ మరింత తగ్గుతుందన్నాడు. వైరస్ నాశనం కోసం వాడే మందులకు ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతానికి తాము వీటిపై పరీక్షలు జరుపుతున్నామని, ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుస్తుందన్నాడు.

క్రికెట్ ను సురక్షితంగా మొదలుపెట్టేందుకు తాను మార్గదర్శకాలను రూపొందిస్తున్నానని చెప్పాడు. ‘ప్రస్తుతం ఇంగ్లండ్ కూడా చాలా మార్గదర్శకాలు తయారుచేస్తోంది. బంతిని క్రిమిరహితం చేయడం ఇందులో ఓ పద్ధతి. దీనివల్ల క్రికెటర్లకు హానీ జరగకుండా ఉంటుంది. ఉమ్మి వాడడం బంద్ చేశారు. కాబట్టి బంతులను కూడా డిసిన్‌ ‌ఫెక్ట్‌‌ చేయాలి. ప్లేయర్లకు తక్కువ రిస్క్ ఉండేలా చేయడమే మా ముందున్న అతిపెద్ద లక్ష్యం’ అని కౌంటారిస్ వ్యాఖ్యానించాడు. కొత్త మార్గదర్శకాలను తమ ప్రొఫెషనల్ క్రికెటర్లకు నేర్పిస్తున్నామన్నాడు.