Breaking News

‘బాలశక్తి, బాల కళ్యాణ్ పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం

‘బాలశక్తి, బాల కళ్యాణ్ పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం

సారథి న్యూస్, కర్నూలు: 2021వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో అందిస్తున్న ‘బాలశక్తి, బాలకళ్యాణ్ పురస్కార్’ అవార్డులు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కర్నూలు జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు(ఐసీడీఎస్) శారద భాగ్యరేఖ తెలిపారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభచూపిన బాలలకు ‘బాలశక్తి పురస్కార్’ అవార్డు, బాలలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు ‘బాల కళ్యాణ్ పురస్కార్’ ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో ఎంపికైన వారికి రిపబ్లిక్​డే సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి ద్వారా అవార్డుతో పాటు నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీలోగా ఆన్​లైన్​ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు https://nca-wdc.nic.in సైట్​ను సంప్రదించాలని ఆమె కోరారు.