Breaking News

బాలల హక్కులు కాపాడాలి

బాలల హక్కులు కాపాడాలి

సారథి న్యూస్, ములుగు: బాలల హక్కుల రక్షణకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్​జీ ఆనంద్ సూచించారు. గురువారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేడారం టోర్నమెంట్ క్రీడల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో ఆటలపోటీల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. అనంతరం వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా సంక్షేమాధికారి ఈపీ ప్రేమలత అధ్యక్షతన లైన్ డిపార్టుమెంట్ లతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం డీసీపీయూ, చైల్డ్-లైన్ 1098, సఖి సిబ్బందితో జిల్లాలోని ప్రతి మండలానికి టీమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పారిజాతం, సీడబ్ల్యూసీ చైర్మన్ పరశురాములు, డీఎంహెచ్​వో డాక్టర్​అప్పయ్య, డీఈవో వాసంతి పాల్గొన్నారు.