సారథి న్యూస్, నడిగూడెం(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఆమె తన సొంత ఇంట్లో హోం క్వారంటైన్లో ఉంటుంది. ఈ సందర్భంలో ఆమె నివాసముంటున్న వీధిలోని ప్రజలు శనివారం బాధితురాలిని అక్కడి నుంచి తరలించాలంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా ప్రాంతానికి చేరుకున్న అధికారులు, పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పినప్పటికీ స్థానికులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. రోడ్డుపైనే స్థానికులు బైటాయించడంతో ట్రాఫిక్కు ఇబ్బంది కలిగింది.
- July 4, 2020
- Top News
- నల్లగొండ
- లోకల్ న్యూస్
- PATIENT
- SURYAPETA
- కరోనా
- నడిగూడెం
- Comments Off on బాధితురాలిని తరలించాలంటూ ధర్నా