సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ఆడపడుచుల ఆత్మ గౌరవం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాత్ రూంల నిర్మాణంలో భారీస్థాయిలో గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామానికి మంజూరైన బాత్ రూంలు ఇష్టారీతిలో నిర్మించి రూ.లక్షల్లో బిల్లులు స్వాహాచేసినట్లు ఉన్నతాధికారులకు తడ్కల్ గ్రామానికి చెందిన సోలంకార్ రాజు ఫిర్యాదు చేశాడు. బాత్ రూంల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన సెక్రటరీలు, వారికి సపోర్టుచేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని గతంలో మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు ఫిర్యాదుచేసినా పట్టించుకునేవారు లేరని సదరు ఫిర్యాదుదారుడు చెప్పాడు.
‘కంగ్టి మండలంలోని గ్రామాలల్లో గతంలో నిర్మించిన బాత్ రూంల నిర్మాణంలో స్థానిక ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు మట్టి పూసి మారేడుకాయ చేశారు. అంత మేం చూసుకుంటాం మీకు మంచిగా బాత్ రూంలు నిర్మించి ఇస్తాం.. ఏం రంది పడకుండ్రని సాకులు చెప్పి నాణ్యతకు విరుద్ధంగా నిర్మించి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చూసినోళ్లకు నాగుబాటుగా మిగిల్చారు’ అని పేర్కొన్నారు.
- October 24, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- KANGTI
- NARAYANAKHED
- TADKAL
- కంగ్టి
- తడ్కల్
- నారాయణఖేడ్
- Comments Off on బాత్ రూంలకు దారేది?