Breaking News

బహిరంగ చర్చకు సిద్ధమా?

సారథిన్యూస్, రామడుగు: చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీఆర్​ఎస్​ నేతలకు కాంగ్రెస్​ బీసీసెల్​ అధ్యక్షుడు పులి ఆంజనేయులు బహిరంగ సవాల్​ విసిరారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పనితీరు అధ్వాన్నంగా ఉన్నదని ఆరోపించారు. కాంగ్రెస్​ కమిషన్ల పార్టీ అని టీఆర్​ఎస్​ నేతలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్​ కమిషన్ల పార్టీ అయితే ఆ పార్టీ నేతలను చేర్చుకుంటున్న టీఆర్​ఎస్​ది కూడా కమిషన్ల పార్టియే కదా అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, వన్నారం ఎంపీటీసీ జవ్వాజి హరీశ్​, నాయకులు బాపిరాజు, అసిఫ్, జక్కుల బాబు, కట్ల శంకర్, కర్నె శ్రీను, ఎలికొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.