లక్నో: ఏతల్లి కన్న బిడ్డనో.. బతికుండగానే మట్టిలో కప్పిపెట్టాలనుకున్నారు. ఆ ఎంత కష్టమొచ్చిందో ఆ బిడ్డను వదిలించుకోవాలనుకుంది. బిడ్డ కంట్లో నలుసు పడితేనే తట్టుకోలేని తల్లి బతికుండగానే మట్టిలో పాతిపెట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిదార్ధనగర్‌లో ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో అక్కడి కూలీలకు చిన్నపిల్లల ఏడుపు వినిపించింది. దీంతో ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుకుతూ వెళ్లిన కూలీలకు మట్టిలో నుంచి చిన్నారి చేయి బయటకు కనిపించింది. అక్కడ జాగ్రత్తగా తవ్వి చూడగా.. అప్పుడే పుట్టిన మగబిడ్డ కనిపించాడు. ఆ బిడ్డను కాపాడిన కూలీలు హాస్పిటల్‌కు తరలించారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని, కొంచెం మట్టి లోపలికి వెళ్లడంతో ట్రీట్‌మెంట్ ఇస్తున్నామని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
- May 28, 2020
- జాతీయం
- షార్ట్ న్యూస్
- CHILD DEATH
- UTTARPRADESH
- కూలీలు
- ట్రీట్‌మెంట్
- Comments Off on బతికున్న బిడ్డను పూడ్చిపెట్టారు