సారథి న్యూస్, పెద్దశంకరంపేట: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఎదగాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలంలోని మార్కెట్ పల్లి గ్రామానికి చెందిన యాదగిరికి ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.15వేల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, సర్పంచ్ రమ్యఅశోక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దత్తు తదితరులు పాల్గొన్నారు.
- December 9, 2020
- Archive
- ముఖ్యమైన వార్తలు
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM RELIEF FUND
- MLA BHUPALREDDY
- NARAYANAKHED
- PEDDASHANKARAMPET
- నారాయణఖేడ్
- పెద్దశంకరంపేట
- భూపాల్‌రెడ్డి
- సీఎం సహాయనిధి
- Comments Off on బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయం