Breaking News

బజాజ్​ ఫైనాన్స్​ కు హెచ్​ఆర్సీ నోటీసులు

లాక్​ డౌన్​ నేపథ్యంలో ఆర్​బీఐ నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి ఈఎంఐలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై బజాజ్​ ఫైనాన్స్​ కు మానవ హక్కుల కమిషన్​ నోటీసులు జారీచేసింది. వచ్చేనెల 28వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈఎంఐలు చెల్లించాలని బెదిరించాలని జాజుల లింగంగౌడ్​ అనే వ్యక్తి ఈ మెయిల్​ ద్వారా హెచ్​ఆర్సీకి ఫిర్యాదుచేశారు.